రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం తీసుకున్న సంఘాలు..

-

సాగు చట్టాలని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ బిల్లులని ఆమోదించినప్పటి నుండి మొదలైన ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చట్టాల వల్ల పారిశ్రామిక వేత్తలకి ఉపయోగమే కానీ రైతులకి ఎలాంటి ఉపయోగం లేదని, పారిశ్రామిక వేత్తలకి సాయం చేయడానికి ఈ చట్టాలు తీసుకొచ్చారని, దీనివల్ల రైతులు పారిశ్రామిక వేత్తలకి బానిసలుగా మారాల్సి వస్తుందని, కనీస మద్దతు ధర ఉండదని, అందుకే ఈ చట్టాలని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతు సంఘాలు అంటున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ ఉద్యమంపై రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మరో రెండేళ్ళయినా ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నామని, దానికి కావాల్సిన అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని, చట్టాలని వెనక్కి తీసుకునేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని రైతు సంఘాల అధ్యక్షుడు రాకేష్ టికాయత్ స్పష్టం చేసారు. రైతులు చేస్తున్న నిరసనపై అంతర్జాతీయ సెలెబ్రిటీల నుండి మద్దతు లభించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news