అన్నదాతలకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ 14వ విడత అప్పుడే..!

-

రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్రం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరువేల రూపాయలు ఇస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ.2వేల చొప్పున రైతుల కి కేంద్రం ఇస్తోంది.

farmers

పీఎం కిసాన్ పథకం 13వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే అందించింది. ఈ విషయం తెలిసిందే. ఇక పీఎం కిసాన్ 14వ విడత గురించి చూస్తే.. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులని 2023 ఏప్రిల్ నుంచి జులై మధ్య తర్వాతి విడత చేస్తారు. దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ డబ్బులు ఏప్రిల్ నుంచి జులై మధ్యన పడచ్చు.

వివరాల కోసం మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. రైతులు కి ఈ స్కీమ్ కింద మరో రెండు వేలు వస్తున్నాయి అని అంటున్నారు. కానీ అది నిజం కాదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కొట్టిపారేశారు. ఈ స్కీమ్ డబ్బులని పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని పార్లమెంటులో చెప్పారు. ఇక స్టేటస్ ని ఎలా చెక్ చెయ్యాలో కూడా చూసేద్దాం.

దీని కోసం ముందు పీఎం కిసాన్ వెబ్‌సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయండి.
ఆ తరవాత ‘ఫార్మర్స్ కార్నర్’ లోకి వెళ్ళండి.
ఇప్పుడు ‘బెనిఫిషియరీ స్టేటస్’ ని సెలక్ట్ చేయండి.
రిజిస్టర్డ్ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
‘గెట్ డేటా’ ట్యాబ్‌పై నొక్కండి. స్టేటస్ డిస్‌ప్లే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news