BREAKING : అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానంపై పట్టు పట్టింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.

షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలను ప్రారంభిచారు స్పీకర్ సీతారాం. వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. అంతేకాదు… స్పీకర్ సీతారాం పై కాగితాలు చల్లారు టీడీపీ సభ్యులు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యులు సస్పెన్షన్ వేటుకు అయ్యారు. ఇవాళ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది అసెంబ్లీ. వరుసగా నాల్గో రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. డోలా వీరాంజనేయులు, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణా, నిమ్మకాయల, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, మంతెన సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news