కరణ్ జోహార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఫరాఖాన్..!

-

ప్రముఖ బాలీవుడ్ నటుడు డైరెక్టర్ , నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తనకంటూ ఏర్పాటు చేసుకున్న కరణ్ జోహార్ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండడం తాజాగా బాలీవుడ్ నిర్మాత కొరియోగ్రాఫర్ అయినా ఫరాఖాన్.. కరణ్ జోహార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా ఆమె కరణ్ జోహార్ డ్రెస్సింగ్ స్టైల్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఒక హోటల్ లాంచ్ కార్యక్రమంలో ఫరాఖాన్ పాల్గొనింది. ఈ నేపథ్యంలోనే ఆమె ధరించిన దుస్తులపై కరణ్ జోహార్ తనను మనీష్ మల్హోత్రా బృందంలో చూస్తే షాక్ అవుతారు అని తెలిపింది. అంతేకాదు నా చెత్త రెడ్ కార్పెట్ పీడకల ఏమిటంటే అందులో కరణ్ జోహార్ కనిపించడమే.. అతను నేను కొరియోగ్రఫీ చేసిన పాటల్లో ఎప్పుడు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ లాగే దుస్తులు ధరిస్తాడు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది ఫరాఖాన్.

అయితే ఫరాఖాన్ కామెంట్లు చేసినప్పుడు కరణ్ జోహార్ అక్కడే ఉండడం విశేషం. ఇదిలా ఉండగా పరాగం సినిమాల విషయానికి వస్తే.. ఆమె చివరిగా దర్శకత్వం వహించిన సినిమా హ్యాపీ న్యూ ఇయర్.. 2014లో విడుదలైన ఈ సినిమా ఇందులో షారుక్ ఖాన్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్ గా నటించారు. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 16 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరికొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news