ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు రన్నింగ్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిసినట్లు సమాచారం. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.