నకిలీ నోట్ల దందా ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతున్న పెద్ద వ్యాపారం.. ఏటీఎం నుంచి తీసే డబ్బు కూడా నకీలీగా ఉంటోంది. అసలు చాలామందికి నకిలీ నోట్లకు, రియల్ నోట్స్‌కు తేడా తెలియదు. దొరకనంత వరకూ అందరూ దొరలే అన్నట్లు..అది నకిలీ నోటు అని తెలియక మార్కెట్లో చలమాణి అవుతున్నాయి. అయితే నోట్లను ప్రింట్ చేయడానికి నేరస్థులు ఎక్కడో శివారు ప్రాంతాల్లో గోడౌన్స్ లాంటివి చూసుకుంటారు.. కానీ ఇక్కడ ఓ తండ్రికొడుకులు ఇంట్లోనే నోట్లను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు..
ఏకంగా..10 కోట్ల నోట్లను ముద్రించారట..అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి ఇంట్లో కూర్చొని రూ. 10 కోట్ల నోట్లను ముద్రించాడు. ఈ విషయం పోలీసులకు తెలియక ముందే ఇద్దరూ కలిసి ఈ నోట్లను అమ్మేశారు. విషయం వెలుగులోకి రావడంతో తండ్రికి 6 ఏళ్లు, కొడుకుకు 2 ఏళ్ల జైలు శిక్ష పడింది.
న్యూయార్క్ యార్క్‌షైర్‌లోని బ్యాంక్ స్ట్రీట్‌లోని తమ ఇంట్లో తండ్రీ కొడుకు కలిసి రూ. 10 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని ముద్రించారు.. వాటిని మార్కెట్లో కూడా విక్రయించేశారు. నకిలీ నోట్ల వినియోగంపై నేషనల్ క్రైమ్ ఏజెన్సీ రిపోర్ట్ చేయడంతో.. నకిలీ నోట్లు చెలామణిలోకి వచ్చిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత వెస్ట్ యార్క్‌షైర్ పోలీసులు, జాతీయ నకిలీ కరెన్సీ ఏజెన్సీ విచారణ జరిపి ఆ విషయాన్ని బహిర్గతం చేసింది. దర్యాప్తులో నిజానిజాలు తేలడంతో తండ్రీ కొడుకులిద్దరిని అరెస్టు చేశారు. కోర్టులో కేసు విచారణ సందర్భంగా నకిలీ నోట్ల వ్యాపారంలో నిమగ్నమైన తండ్రీకొడుకుల దోపిడీని వారు నకిలీ నోట్లను ముద్రించి, ఆపై వ్యక్తులకు ఎలా విక్రయించారో వివరంగా చెప్పారు.
అయితే..నిందితుడి ఇంట్లో పోలీసులు సోదాలు చేసి.. రూ. 2 కోట్ల విలువైన నకిలీ నోట్లు, వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. డై ప్రింటర్‌తో పాటు నకిలీ నోట్లు కూడా దొరికాయని పోలీసులు వెల్లడించారు.. నకిలీ నోట్ల రాకెట్లో నిందితుడు, తండ్రి క్రిస్టోఫర్ గౌంట్కు కోర్టు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కుమారుడు జోర్డాన్‌కు 2 సంవత్సరాల సస్పెండ్ శిక్ష విధించారు..
మన దేశంలో కూడా చాలా మంది గుట్టుగా ఈ వ్యాపారాన్ని చేసుకుంటున్నారు..అందుకే చేతితో డబ్బులు తీసుకోవాల్సిన టైమ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి.. ముఖ్యంగా పెద్ద నోట్ల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి.. మీకు తెలుసో లేదో రెండు వేల రూపాయాల ప్రింటింగ్ ఆపేసి రెండేళ్లు అయింది..