దేశం ఎంత అభివృద్ధి చెందినా.. ఆధునిక పరిజ్ఞానం మనల్ని ఎంత ముందుకు తీసుకువెళ్లినా.. కొన్ని ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉంటున్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల భారమనే భావనలోనే చాలా మంది తల్లిదండ్రులున్నారు. అలా ఆడపిల్లను భారంగా భావించే ఓ తండ్రి.. మూడోసారి కూడా అమ్మాయే పుట్టిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
‘జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో సులేమాన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అహ్మద్(35)కు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఫర్నిచర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం భార్య కాన్పుకోసం కర్ణాటక రాష్ట్రంలోని తన పుట్టింటికి వెళ్లింది. మూడోసారి కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది.
మళ్లీ ఆడపిల్లే పుట్టిందని తెలుసుకున్న అహ్మద్ కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడు. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహ్యత్య చేసుకున్నాడని’ అత్తాపూర్ ఔట్‌పోస్టు ఎస్సై కిషన్‌జీ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.