వైట్ హౌస్ లో భయం భయం…! ట్రంప్ కి భద్రత పెంపు…?

-

ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ సులైమానీని అమెరికా హత్య చేసిన తర్వాత ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అమెరికా మీద పగ సాధించడానికి ఆ దేశం సిద్దమవుతుంది. మంగళవారం అమెరికా బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు చేయడం, అమెరికా ఏదైనా సైనిక చర్యకు దిగుతుంది ఏమో అనే వ్యాఖ్యలు వినపడటంతో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

ఇక ట్రంప్ తల నరికి తెస్తే ఇరాన్ దాదాపు 600 కోట్లు ఇస్తామని సంచలన ప్రకటన చేయడంతో ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన అమెరికాలో వ్యక్తమవుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి భారీగా భద్రతను పెంచారు అధికారులు. వైట్ హౌస్ చుట్టుపక్కల మొత్తం భారీగా బలగాలను మోహరించిన అమెరికా, సామాన్యులను కూడా ఆ ప్రాంతంలోకి రానీయడం లేదు. వైట్ హౌస్ లో పని చేసే అధికారులకు కూడా కీలక హెచ్చరికలు చేసారు.

కీలక అధికారులకు అమెరికా ప్రభుత్వం సెలవలను రద్దు చేసింది. ఏ విధమైన అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతుంది. వైట్‌హౌస్‌ సమీపంలోని చెక్ పాయింట్లలో అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు నిఘా పెట్టారు. ట్రంప్ కాన్వాయ్ లో కూడా మార్పులు చేసారు. ట్రంప్ కి సంబంధించి కొన్ని పర్యటనలను కూడా అధికారులు రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news