మంగళూరులోని ఒక ఆలయ హుండీలో కండోమ్ దొరికిన సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆలయం మంగళూరు స్థానిక దేవుడు కోరగజ్జకు చెందినది, ఆయనను శివుడికి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పోలీస్ కమిషనర్ ఎన్ శశి కుమార్ మాట్లాడుతూ, కొరగజ్జ వద్ద కండోమ్ సహా దేవాలయాల హుండీల్లోకి దుండగులు అభ్యంతరకరమైన వస్తువులు పడవేయడం పై ఉల్లాల్, కద్రీ, పాండేశ్వర్ పోలీస్ స్టేషన్లలో గత మూడు నెలల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ దేవాలయాల అపవిత్రం వెనుక ఉన్న నిందితులను పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే అకస్మాత్తుగా రహీమ్ అలాగే తౌఫిక్ ఇద్దరూ పూజారుల నుండి క్షమాపణ కోరడానికి ఆలయానికి వెళ్ళడం ప్రారంభించారు.
మొదట్లో పూజారులు ఈ ఇద్దరూ సరదాగా ఏడిపించదానికి వస్తున్నారని భావించారు, కానీ చివరకు, వారు తమ ఘోరమైన నేరాన్ని ఆలయంలో అంగీకరించారు. అక్కడి ప్రజలకు లొంగిపోయారు, తరువాత వారిని పోలీసులకు అప్పగించారు. అయితే రహీమ్ మరియు తౌఫిక్ ఇద్దరూ తమ తప్పు ఒప్పుకోవటానికి తిరిగి ఆలయానికి ఎందుకు వచ్చారా ? అని ఆరా తీస్తే మూడవ మరియు ప్రధాన అపరాధి అయిన నవాజ్ హుండీలో కండోమ్ వేశాడు. అయితే అతను అనుమానస్పద పరిస్థితులలో మరణించాడు. ఈ తప్పు చేసినప్పటి నుండే నవాజ్ పిచ్చిగా వ్యవహరించడం ప్రారంభించాడు, అది రక్త వాంతులు మరియు విరేచనాలుగా మారింది. చివరగా, నవాజ్ తన తలను గోడపై కొట్టుకుని మరణించాడు, అతను చనిపోయే ముందు కోరగజ్జా దేవుడు నేరస్థులపై కోపంగా ఉన్నాడు అని చెబుతూ మరణించాడు. నవాజ్ మరణం తరువాత, తౌఫిక్ కూడా రక్తం వాంతులు వంటి లక్షణాలతో బాధపడటం ప్రారంభించాడు. దీంతో ఇద్దరు భయపడి పోయారు. దీంతో వారు తప్పు అంగీకరించి చేసిన నేరానికి క్షమాపణ కోరితేనే రక్షింపబడతారని నిర్ణయించుకున్నారు.