కేజ్రీవాల్‌కు.. ల‌వ‌ర్స్ డేకు పెద్ద లింకే ఉందిగా..!!

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయింది. 11 జిల్లాల్లో 21 కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తుతో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. స్పష్టమైన మెజార్టీతో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఇక సారి కూడా కేజ్రీవాల్‌నే గెలిస్తే.. హ్యాట్రిక్ సాధించినట్లవుతుంది. దీంతో ఫిబ్ర‌వ‌రి 14 అంటే ప్రేమికుల రోజు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. అయితే కేజ్రీవాల్‌కు ప్రేమికుల రోజు చాలా స్పెష‌ల్ అని చెప్పాలి.

ఎందుకంటే.. 2013, 2015 సంవత్సరాల్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రేమికుల రోజుతో లింక్ ఏర్పడింది. వివ‌రాల్లోకి వెళ్తే.. 2013లో ఢిల్లీలో డిసెంబరు 4న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, డిసెంబరు 8న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ 31, ‘ఆప్’ 28, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ‘ఆప్’ కాంగ్రెస్‌తో జతకట్టాల్సి వచ్చింది. దీంతో డిసెంబరు 28న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఆ తరువాత ఆప్, కాంగ్రెస్ మధ్య విబేధాలు కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. దీనికిగానూ ఈయ‌న ఫిబ్ర‌వ‌రి 14ను ఎంచుకున్నారు. ఇక ఆ త‌ర్వాత 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయాని కొస్తే, ఫిబ్రవరి 7న ఎన్నికల జరగగా, 10న ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 14న అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మ‌రి మ‌ళ్లీ ఆప్ ఘనవిజయం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఆయన మరోసారి ఫిబ్రవరి 14వ ప్ర‌మాణ‌స్వీకారానికి ఎంచుకోనున్నారు. అదే జ‌రిగితే ఓ ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే.. మరో రెండు ఫిబ్రవరి 14 తేదీల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన‌ట్టు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news