ఫిబ్రవరి 07 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ పుష్యమాసం- ఫిబ్రవరి – 7- ఆదివారం.

 

మేష రాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. ఆర్థిక నష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ధననష్టం. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. తక్కువ మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులు పోటీపరీక్షల్లో తక్కువ మార్కులు పొందుతారు.

పరిహారాలుః హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభ రాశి:ఆర్థిక లాభాలు పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారాలను విస్తరించుకొని ఆర్థిక లాభాలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్నేహితుల సహకారాన్ని పొందుతారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని తలపెడతారు.

పరిహారాలుః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ఈరోజు కార్యాలయాల్లో అనుకూలత !

ఈరోజు బాగుంటుంది. మొండి బకాయిలను వసూలు చేసుకొని ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచు కుంటారు. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. బంధువులతో, స్నేహితులతో సహాయ సహకారాలు అందుకుంటారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలత లభిస్తుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీ రామ నామ పారాయణం పారాయణం చేసుకోండి.

 

 కర్కాటక రాశి:ఈరోజు ఉన్నత విద్యలకు అర్హులవుతారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు అందుకుంటారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. శత్రువుల బెడద తగ్గిపోతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు లాభాలు కలిగిస్తాయి.

పరిహారాలుః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ప్రయాణాల వల్ల నష్టం !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణాల వల్ల నష్టం జరుగుతుంది. ప్రమాదాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల ఆర్థిక నష్టం జరుగుతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. విద్యార్థులు అనవసరపు విషయాలను పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు.

పరిహారాలుః ఈరోజు నవగ్రహారాధన చేసుకోండి, దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాభిషేకం చేయించుకోండి.

 

కన్యారాశి:ఈరోజు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి ప్రమోషన్లు పొందుతారు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటారు.

పరిహారాలుః ఈరోజు గణపతిని ఆరాధన చేసుకోండి.

 

 తులారాశి:కార్యాలయాల్లో పని ఒత్తిడి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువు మీద శ్రద్ధ చూపక విద్యా నష్టం జరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదం  జరిగే సూచన ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి వల్ల మానసిక వేదనకు గురవుతారు.

పరిహారాలుః ఈరోజు సంకటహర గణపతి స్తోత్ర పారాయణం చేసుకోండి దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి దర్శించుకొని గణపతికి గరిక  సమర్పించు కోండి.

 

వృశ్చిక రాశి:విజయం సాధిస్తారు !

ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువులను కూడా మిత్రులుగా చేసుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించడం వల్ల లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ప్రఖ్యాతలు పొందుతారు.

పరిహారాలుః ఈ రోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

 ధనస్సురాశి:కార్యాలయాల్లో అనుకూలతలు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గృహంలో వేడుక జరిగే అవకాశం ఉంది.  ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. కోరుకున్న స్థానాలకు స్థాన మార్పిడి అవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారంలో భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. కొత్త వ్యక్తులతో పరిచయాలు నష్టం కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలను రహస్యంగా ఉంచకుండా బయట పెట్టడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు.

పరిహారాలుః ఈ రోజు శివారాధన చేసుకోండి. శుభ ఫలితాలు ఏర్పడతాయి.

 

కుంభరాశి:స్వల్ప లాభాలు ఏర్పడతాయి !

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవడం మంచిది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప లాభాలు ఏర్పడతాయి. వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేసే విషయంలో పెద్ద వారి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కుటుంబ సభ్యుల మధ్య అనుకోని సమస్యలు రావచ్చు.

పరిహారాలుః ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు  ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్వల్ప అనారోగ్యం ఏర్పడుతుంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉన్నత వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. అన్నదమ్ములు అక్క చెల్లెలు తో కలిసితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఉమ్మడి వ్యాపారాలను ప్రారంభించడం వలన లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news