ఫిబ్రవరి 8 – పుష్య మాసం – సోమవారం
మేష రాశి:పదోన్నతి పొందుతారు !
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ లాభం కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించుకొని, అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. గృహంలో శుభకార్యం జరుపుతారు. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యత. ఆనందంగా ఉంటారు. అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.
పరిహారాలుః ఈరోజు శ్రీ శివపార్వతీ దేవతలను ఆరాధించండి.
వృషభ రాశి:శత్రువులు కూడా మిత్రులు అవుతారు !
ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. లాభం పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలం తీర్థయాత్రలు చేస్తారు. స్థిర ఆస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార లాభాలు కలుగుతాయి.
పరిహారాలుః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.
మిధున రాశి:నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం !
ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బులు అందుతాయి. ఆర్థిక లాభం పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. క్రొత్త వ్యాపార పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. నీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. సోదరులతో సఖ్యత గా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు.
పరిహారాలుః శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఆరాధించండి.
కర్కాటక రాశి:వివాహ సంబంధ చర్చలు అనుకూలిస్తాయి !
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎంత కష్టమైనా నిర్ణయాలైనా ధైర్యం గా సాహసంతో తీసుకుంటారు. స్నేహితుల సహకారంతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. వివాహ సంబంధ చర్చలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు.
పరిహారాలుః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.
సింహరాశి:శుభయోగం ఉంటుంది !
ఇవాళ శుభయోగం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితో సఖ్యతగా, సంతోషంగా ఉంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యకు అర్హులవుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వలన లాభాలు కలుగుతాయి. వివాహ నిశ్చయ తాంబూలలకు అనుకూలం. అనారోగ్యాలను పూర్తిగా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ధన ప్రాప్తి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి.
కన్యారాశి:ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి !
ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకో లేక ధననష్టం కలుగుతుంది. వాహనాలను జాగ్రత్తగా నడపడం మంచిది. ప్రమాదాలు సంభవిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల అనారోగ్య సూచనలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు అనుకూలం కాదు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పరిహారాలుః ఈ రోజు దుర్గా దేవి ఆరాధన చేసుకోండి. దగ్గర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకోండి.
తులారాశి:ధన ప్రాప్తి కలుగుతుంది !
ఈ రోజు బాగుంటుంది. స్నేహితులతో బాగుంటుంది. స్నేహితులతో అందరితో కలిసి మెలిసి ఆనందంగా సఖ్యతగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాలను విస్తరించుకొని అధిక లాభాలు పొందుతారు. అధిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.
వృశ్చిక రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !
ఈరోజు అనుకూలంగా లేదు. మీలో ఉన్న తొందరపాటుతనం నష్టం కలుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే లేక ఇబ్బంది పడతారు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. విద్యార్థులు విద్య మీదనే శ్రద్ద వహించడం మంచిది. గర్భిణి స్త్రీలు జాగ్రత్తలు వహించండి.
పరిహారాలుః ఈరోజు దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.
ధనస్సు రాశి:మొండి బకాయిలు వసూలు!
ఈరోజు అంతా బాగుంటుంది. మొండి బకాయిలు వసూలు చేసుకుని ధనప్రాప్తి కలుగుతుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభిం చేయడం వలన అధిక లాభాలు కలుగుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. శత్రునాశనం. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ విద్యార్థుల పేరు పొందుతారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. వివాహాది నిశ్చ
యాలకు అనుకూలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు.
పరిహారాలుః శివాభిషేకం చేయించండి.శివారాధన చేయండి.
మకర రాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప నష్టాలు !
ఈరోజు ప్రయోజనకరంగా ఉండదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పరిహారాలుః నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయండి.
కుంభరాశి:పోటీపరీక్షల్లో విజయం పొందుతారు !
ఈ రోజు బాగుంటుంది. అందరితో కలిసి మెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధన ప్రాప్తి పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. విద్యార్థులు బాగా చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ కలుగుతుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు కలుగుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాన్ని జరుపుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు.
పరిహారాలుః శ్రీ లలితా సహస్రనమాలను పారాయణం చేసుకోండి.
మీన రాశి:సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు !
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకూలంగా ఉంటుంది., పదోన్నతులు పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. సంతాన విషయంలో ఉత్తమ ప్రయోజనాలను అందుకుంటారు. గతంలో పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు.
పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.
- శ్రీ