మెంతుల‌లో షాక్ అయ్యే బ్యూటీ సీక్రెట్స్‌

-

స‌హ‌జంగా మెంతులను అనేక రకాల కూరల్లో వాడుతుంటారు. ప్రతి ఇంట్లోనూ వీటిని పోపు గింజలతో కలిపి వాడుతారు. వీటిని ఎక్కువగా పచ్చళ్లలో, చారు, పులుసు వంటివి చేసినప్పుడు వాటిలో వేస్తారు. దీంతో ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మెంతుల వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌న్న విష‌యం తెలిసిందే.. మెంతి ఆకు కొద్దిగా చేతుగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. అందుకే చాలామంది మెంతి ఆకును ఇష్టపడరు. కానీ మెంతిలోని పోషకాలు చాలా విలువైనవి.

అయితే మెంతులు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ మెంతుల్లో అనేక ఆయుర్వేద లక్షణాలు  ఉన్నాయి. మనం రోజు ఇంట్లో చూసే మెంతులు మన జుట్టుకు, చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌రి వాటిని ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

– పెరుగులో కొన్ని మెంతుల‌ను నాన‌బెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం పై రాసుకోవ‌డం వ‌ల్ల చర్మం పై ఉండే ముడతలు, మొటిమలను తొల‌గిస్తుంది.

– మెంతి పౌడర్ ని నీటిలో కలిపి చర్మానికి రాసుకోవడం వల్ల పొడిబారిన చర్మాన్ని ర‌క్షిస్తుంది. అలాగే మెంతులు చర్మానికి మాయిశ్చరైజర్ అందిస్తాయి.

– మెంతులను కొబ్బరి నూనెలో వేసి మూడు వారాల త‌ర్వాత ఆ నూనెతో తరచుగా జుట్టును మర్దన చేసుకోవ‌డం వ‌ల్ల‌ హార్మోన్స్ అంది, జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.

– మెంతి పొడిని, పాలలో క‌లిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెంతులు చర్మాన్ని మురికిని తొల‌గించి కాంతివంతంగా చేస్తాయి.

– తేనెలో మెంతి పొడి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డెడ్ స్కిన్ సెల్స్ ని చాలా తేలికగా తొలగించడానికి మెంతులు సహాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news