అందానికి మెంతులు..ఎలాంటి మేలు చేస్తాయో తెలుసా..!!!

-

అందంగా కనిపించాలని ఎవరు అనుకోరు, ప్రతీ ఒక్కరికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఉంటుంది. అలాగే సహజంగా అందమైన ఆకృతి కలిగిన వాళ్ళు తమ అందాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని ఆరాట పడుతుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్ లో దొరికే లేని పోనీ క్రీములు ముఖానికి పూసుకుని చివరికి అవి వికటిస్తే భాదపడుతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే సౌందర్య కారకాలలో అన్నీ రసాయన పదార్ధాలతో తయారయ్యేవే. మరి అలాంటి వాటిని చర్మానికి పట్టిస్తే ఎలాంటి దుష్పరిణామాలు అయినా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే

సహజ సౌందర్య సాధనలు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఎలాంటి పాతకాలపు పద్దతులు ఉన్నాయో తెలుసుకోవాలి.పాతకాలం పద్దతే అనిపించినా ఫలితం చూపించడంలో మాత్రం కొత్తదనం కనిపిస్తుంది.  మరి సహజ అందం పొందాలంటే ఎలాంటి పద్దతులని అవలభించాలో ఇప్పుడు చూద్దాం.  మెంతులు ఇవి మన వంటింట్లో దొరికేవే. ఎక్కువగా వీటిని పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు, లేదా ఆహార పదార్ధాలు వండే సమయంలో వాడుతూ ఉంటారు. కానీ

వీటిని చర్మ సౌందర్యలో, చర్మంపై వచ్చే అలర్జీల నివారణ కోసమో ఉపయోగిస్తారు అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ మెంతులతో చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవచ్చంటే. ముందుగా కొన్ని మెంతులు తీసుకుని వాటిని మెత్తగా పోడిలా చేయాలి. ఆ తరువాత ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి. ఈ రెండిటి తో పాటు కొంచం దోసకాయ గుజ్జు కలపాలి. ఈ మూడు మిశ్రమాలని కలిపిన తరువాత. అందులో కొంచం సున్నపు తేట ,కొబ్బరి నీళ్ళు పోసి పేస్టులా చేసుకోవాలి.

ఇలా వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి సుమారు గంట పాటు ఉంచి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు అలా రెండు నెలలు చేస్తూ ఉంటే తప్పకుండా మీ ముఖంలో మార్పుని మీరు గమనిస్తారు.  ఈ మిశ్రమం ముఖంపై ఉండే నల్ల మచ్చలని, మొటిమలని సైతం నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news