రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫీవ‌ర్ స‌ర్వే ప్రారంభం కానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు ఆదేశాల‌తో రాష్ట్రంలో మూడో సారి ఫీవ‌ర్ స‌ర్వే చేయ‌నున్నారు. నేటి నుంచి జ‌ర‌గే ఫీవ‌ర్ స‌ర్వే కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఏకంగా కోటి ఐసోలేష‌న్ కిట్ ల‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి తీవ్రం గా ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 4,207 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో క‌రోనా వ్యాప్తి ని అరిక‌ట్ట‌డానికి ప్ర‌తి ఇంటికి వెళ్లి ఫీవ‌ర్ స‌ర్వే చేయ‌నున్నారు.

ఇంటింటి స‌ర్వేలో ఎవ‌రికైనా జ్వ‌రంతో పాటు ఇత‌ర ల‌క్ష‌ణాలు ఉంటే అక్క‌డే అవ‌సరం అయిన మందులు ఇస్తారు. ఈ ఫీవ‌ర్ స‌ర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ కార్య‌క‌ర్త‌లు, ఏఎన్ఎంలు కీలక పాత్ర వ‌హించ‌నున్నారు. ఫీవ‌ర్ స‌ర్వే కోసం 25 వేల మంది పైకాగా ఏఎన్ఎంల తో పాటు 7 వేల‌కు పైగా ఆశ కార్య‌క‌ర్తలు అందుబాటు లో ఉండ‌నున్నారు. ఫీవ‌ర్ స‌ర్వే కోసం ఇప్ప‌టి కే అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు వీడియో కాన్ఫ‌రేన్స్ ద్వారా మాట్లాడారు. అలాగే ఈ ఫీవ‌ర్ స‌ర్వే కోసం మున్సిప‌ల్, పంచాయతీ రాజ్ సిబ్బంది కూడా స‌హ‌క‌రించాల‌ని మంత్రి హ‌రీష్ రావు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news