తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కూడా దేశ వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించిందని అన్నారు. అలాగే గుండె సంబంధత సమస్యలకు చెక్ పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్యాథ్ ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
ఇప్పటి వరకు క్యాథ్ ల్యాబ్ సేవలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం అయి ఉన్నాయని అన్నారు. కానీ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను పునరుద్దిస్తామని ప్రకటించారు. అదిలాబాద్ జిల్లాలో కూడా క్యాథ్ ల్యాబ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగ ఈ రోజు మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. 7.5 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ ను ప్రారంభించారు. అలాగే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తల్లి పాల నిల్వ నిధి కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.