భారత సైన్యానికి చెందిన శిక్షణా విమానం పంట పొలాల్లో కుప్ప కూలింది. ఈ ఘటన బిహార్ లోని గయ సమీప ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగ సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ లోని గయాలో సైనిక శిక్షణ అకాడమీ ఉంది. కాగ ఈ రోజు ఇద్దరు ట్రైనీ పైలెట్లు విమానంలో శిక్షణ తీసుకుంనేందుకు గాల్లోకి ఎగిరారు. అయితే విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయంలోనే విమానం అకస్మాతుగా కుప్ప కూలింది.
అయితే జనావాసం లేని చోట విమానం క్రాస్ అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అలాగే విమానంలో ఉన్న ఇద్దరు ట్రైనీ పైలెట్లు కూడా సురక్షితంగా ఉన్నారని సైనిక అధికారులు వెల్లడించారు. అయితే విమానం కుప్ప కూలిన తర్వాత పైలెట్లు అందులో చిక్కుకున్నారు. అది గమనించిన స్థానికులు ఇద్దరు పైలెట్లును సురక్షితంగా బయటకు తీశారు. కాగ విమానం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.