Fighter : హృతిక్ ‘ఫైటర్’ నుంచి ‘హీర్ ఆస్మాని’ సాంగ్ రిలీజ్..

-

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్’. గతంలో హృతిక్ రోషన్ తో ‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ వంటి చిత్రాలు తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నారు. ఈ డైరెక్టర్ ‘పఠాన్’ లాంటి సూపర్ హిట్ ని అందుకోవడంతో.. ఇప్పుడు ఫైటర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటుంది.

ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. సినిమా టీజర్ అండ్ సాంగ్స్ ని విడుదల చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ ని విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా మూడో సాంగ్ ని కూడా విడుదల చేశారు. ‘హీర్ ఆస్మాని’ అంటూ సాగే సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.

 

విశాల్ శేఖర్ సంగీతం సమకూరుస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా నీ వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version