బ్యాంకు ఖాతాలకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. ఐతే అనుసంధానం గురించి చాలా రోజులుగా చెబుతూనే ఉన్నా ఇంకా చాలా బ్యాంకు ఖాతాలు ఆధార్ అనుసంధానం లేకుండానే ఉన్నాయి. ఈ విషయమై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ లో మాట్లాడింది. భారతీయ బ్యాంక్స్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన ఆర్థిక మంత్రి, వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకూ ప్రతీ బ్యాంకు అకౌంట్ కి ఆధార్ అనుసంధానం పూర్తి కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసారు.
ప్రస్తుతం మిగిలిపోయిన ప్రతీ అకౌంట్ కి ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా జరగాలని, ఆ తర్వాత అవసరమైన వారందరి బ్యాంకు ఖాతాలకి పాన్ కార్డ్ లింక్ చేయాలని సూచించింది. ఇంకా డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించేలా బ్యాంకులు వ్యవహరించాలని, యూపీఐ చెల్లింపులని సైతం ప్రోత్సహించాలని ఆదేశించింది.