ఐటి రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ నేపధ్యంలో జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసారు. ఆధార్, పాన్ కార్డ్ లింక్ గడువుని కూడా అప్పటి వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై ఆర్ధిక ప్యాకేజి పై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు.
ఆర్ధిక అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశం లేదని అన్నారు. పన్నుల చెల్లింపు పై అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నామని, ఆర్ధిక వ్యవస్థ గాడిన పెట్టడానికి శ్రమిస్తున్నామని అన్నారు. రిటర్న్ ఆలస్యం అయితే మాత్రం 9 శాతం ఫైన్ విధిస్తున్నట్టు చెప్పారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికే లాక్ డౌన్ అని ఆమె అన్నారు. అందుకే ఐటి రిటర్న్ గడువుని పెంచుతున్నామని ఆమె వివరించారు.
కరోనాపై అనేక పథకాలను ప్రకటిస్తామని ఆమె వివరించారు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె వివరించారు. కాగా పన్ను చెల్లింపు ఈ నెల 31 కి పూర్తి కానుంది. కరోనా ఆర్ధిక ప్యాకేజి పై దాదాపు ఒక కొలిక్కి వచ్చామని అన్నారు. కరోనా దేశంలో అదుపులోనే ఉందని ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. జిఎస్టీ పన్నులు చెల్లించేందుకు జూన్ 30 వరకు గడువు ఉందన్నారు.