‘మా ఆర్థిక పరిస్థితి దారుణం’: ఎయిరిండియా..!

-

కరోనా కారణంగా తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని ఎయిరిండియా ప్రకటించింది. అయితే తమ విమాన సర్వీసులు కొనసాగేలా చూసేందుకు ఉద్యోగులకు వేతనం లేకుండా సెలవు పద్దతి పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ నెల 7న ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ పథకం 6 నెలలు, రెండేళ్లు, 5 ఏళ్లు కూడా ఉండవచ్చునని, ఉద్యోగులు తమ సెలవు కాలంలో మెడికల్, ప్యాకేజీ ప్రయోజనాలను పొందవచ్చని ఎయిరిండియా పేర్కొంది.

ప్రస్తుతం ఈ సంస్థ వేతన బిల్లు నెలకు రూ. 250 కోట్లు ఉంది. ఈ కొత్త పథకాన్ని వినియోగించుకునే ఏ ఉద్యోగి కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో జాబ్ చేయడానికి వీలు లేదని కూడా ఆంక్షలు విధించారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో విమానయాన రంగాలపై పడిన ప్రభావం అంతాఇంతా కాదు. విమానాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉండడం.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖర్చును తగ్గించుకోవడమే లక్ష్యంగా పలు విమానయాన సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news