విదేశాల్లో కిడ్నీ సర్జరీ చేయిస్తానంటూ మోసం..!

-

హైదరాబాద్ లో షణ్ముఖ పవన్ శ్రీనివాస్ అనే వ్యక్తి విదేశాల్లో కిడ్నీ చికిత్స చేయిస్తానంటూ మోసాలకు పాల్పడ్డాడు. శ్రీలంకతో పాటు టర్కీ దేశాల్లో కిడ్నీ సర్జరీ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. ఇతర దేశాలు వెస్టర్న్, నావలోక, హేమాస్, శ్రీలంక హాస్పిటల్ లో సర్జరీ చేస్తామని బాదితుల నుంచి 30 నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.

kidny
kidny

విదేశాల్లో అయ్యే ఆపరేషన్ ఖర్చుల గాను ఐదు లక్షలు చెల్లిస్తున్నారు. 2019లో బాధితులు బిజ్జల భారతి గతంలో నిందితుడు శ్రీనివాస్ ను తన భర్తకు రెండు కిడ్నీలు అవసరం అని కలిసింది. శ్రీనివాస్ బాధితుల నుంచి పాస్ పోర్ట్, ఫ్లైట్ టికెట్స్ కోసం 14 లక్షలు రూపాయిలు తీసుకున్నాడు. కానీ నిందితుడు శ్రీనివాస్ ఏలాంటి ఏర్పాట్లు చేయకుండా డబ్బులతో ఉడాయించాడు. బాధిత కుటుంబం బంజారాహిల్స్ పోలీసులకు జూన్ 2019లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పూర్తి ఆధారాలతో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news