చంద్రబాబు అనే చీడ పురుగును ఏపీ నుంచి తరిమికొట్టాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పేర్కొన్నారు. 12 ఏళ్ల ముందు వైఎస్ ఆశయాల మీద నాటిన పునాది వైసీపీ జెండా….అలుపెరకుండా శ్రమించిన ధీరుడు మన జగనన్న అని రోజా తెలిపారు. చంద్రబాబు,పవన్ లకు రోజా సవాల్ విసిరారు. మీకు దమ్ముంటే రండి…ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామాని ఛాలెంజ్ చేశారు.
ఢిల్లీలో చక్రం తిప్పానని చంద్రబాబు కబుర్లు చెబుతాడు…కానీ గల్లీలో కూడా గౌరవం దక్కక ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మీటింగ్ లకు జనాలు రావడం లేదు…చంద్రబాబు మమ్మల్ని చూసి భయపడుతున్నాడని చురకలాంటించారు. కరోనా సమయంలో ప్రజల కష్టాలు చంద్రబాబుకి గుర్తు రాలేదు..వైసీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ప్రతిపక్షాలు పారిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంది కాబట్టే కాలర్ ఎగరేసి మరీ ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం….చంద్రబాబులా జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదని గుర్తు చేశారు.ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని…అలాంటి చంద్రబాబును నమ్ముకున్నందుకు కార్యకర్తలకైనా బుర్ర ఉండాలన్నారు. చంద్రబాబు అనే చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఫైర్ బ్రాండ్ రోజా.