ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా.?: యశ్వంత్ సిన్హా

-

రాష్ట్రపతి ఎన్నికల వామపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ చేరుకున్నారు. యశ్వంత్ సిన్హా కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు టిఆర్ఎస్ భారీ ర్యాలీగా బయలుదేరింది. అనంతరం యశ్వంత్ సిన్హా కు జలవిహార్ లో టిఆర్ఎస్ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. టిఆర్ఎస్ తనకు మద్దతు ఇస్తున్నందుకు యశ్వంత్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కెసిఆర్ వివరించారని ఆయన చెప్పారు. కేటీఆర్ ఢిల్లీకి వచ్చి తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం ఇది అని అన్నారు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. దేశానికి కెసిఆర్ వంటి నేత అవసరమని, కేసీఆర్ తో మరోసారి సమావేశమవుతానని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news