కేజీఎఫ్ కు పోటీ ఇవ్వ‌నున్న అమీర్ ఖాన్

-

త‌మిళ్ స్టార్ హీరో య‌ష్ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శంత్ నీల్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న కేజీఎఫ్ -2. అయితే ఈ సినిమా కు పోటీ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వ‌స్తున్నారు. య‌ష్ కేజీఎఫ్ -2 సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నెల‌లో 14 తేదిన విడుద‌ల చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ అగ్ర‌హీరో అమీర్ ఖాన్ హీరో గా క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా వ‌స్తున్న సినిమా లాల్ సింగ్ చ‌ద్ధా అనే సినిమా కూడా వ‌చ్చే ఏడాది వేస‌వి కానుక గా ఏప్రిల్ 14 న విడుద‌ల చేస్తున్న‌ట్టు లాల్ సింగ్ చ‌ద్ధా చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌కటించింది.

అయితే ఈ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చ‌ద్ధా అనే సినిమా టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత‌న్య కూడా ఒక కీల‌క పాత్ర లో న‌టిస్తున్నాడు. దీంతో ఈ సినిమా కు తెలుగు లో కూడా మంచి పోటీ ఉంటుంది. అయితే కేజీఎఫ్ -2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌ల అవుతుంది. అయితే లాల్ సింగ్ చ‌ద్ధా అనే సినిమా కూడా పాన్ ఇండియా రెంజ్ లోనే విడుద‌ల కాబోతుంది. అయితే వేస‌వి పోటీ లో ఎవ‌రూ గెలుస్తారో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news