కంటిచూపులతోనే మంటలు పుట్టిస్తున్న కమల్ హాసన్..‘విక్రమ్’ ఫస్ట్ సింగిల్ ముహుర్తం ఫిక్స్

-

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. ‘‘మాస్టర్, ఖైదీ’’ ఫేమ్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్..పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ నెల 15న చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపిన మేకర్స్ తాజాగా మరో అప్ డేట్ ఇచ్చేశారు.

ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ను ఈ నెల 11న విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సదరు ప్రోమోలో కమల్ హాసన్..కంటి చూపులతోనే నటించేస్తున్నారు. రౌద్రంగా ఉండే తన కళ్లను చూపించి కమల్ హాసన్ సినీ లవర్స్ ను ప్రోమోలో అబ్బురపరసున్నారు.

ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ పిక్చర్ ఈ ఏడాది జూన్ 3న విడుదల కానుంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మేకర్స్. అన్ని భాషల్లోనూ విడుదల కానున్న ఈ పిక్చర్ డెఫినెట్ గా రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్రంలో కమల్ హాసన్ మరో సారి తన నట విశ్వరూపం చూపుతారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news