హైదరాబాద్ లో కాల్పుల కలకలం

-

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాలా పత్తర్ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. భార్య, కొడుకు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి హబీబ్ హాష్మి కాల్పులు జరిపారు.  తల్లి కొడుకులు తృటిలో తప్పించుకునట్టు చెబుతున్నారు. ఆ ఇద్దరి మీద హాబీబ్ హష్మీ మూడు రౌండ్లు కాల్పులు జరిపారు అని అంటున్నారు. దీంతో తన తండ్రి తన మీద, తన తల్లి మీద హత్యా ప్రయత్నం చేశారు అని, ఇద్దరి మీద కాల్పులు జరిపారు అని ఆయన కుమారుడు ఉమర్ పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో హబీబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన వద్ద ఉన్న రివాల్వర్ అలాగే నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు తన సొంత కొడుకు మీద అలాగే భార్య మీద ఎందుకు కాల్పులు జరిపాడు అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రివాల్వర్ లైసెన్స్ రివాల్వర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more RELATED
Recommended to you

Latest news