RADHESHYAM : రాధేశ్యామ్ నుంచి బిగ్ అప్డేట్.. ఫస్ట్‌ సింగిల్‌ ముహుర్తం ఫిక్స్

-

టాలీవుడ్‌ స్టార్‌, రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌,… హీరోగా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్‌. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్‌ చేస్తుండగా… యూవీ క్రియేషన్స్ సమర్పణం లో రాధేశ్యామ్‌ తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ తేదీని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ”ఈ రాతలే” అనే ఫస్ట్‌ సింగిల్‌ ను నవంబర్‌ 15 వ తేదీన సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్‌ తో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news