జనవరి 13, 2022, మత్స్య శాఖ, భారత ప్రభుత్వం, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో “ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్”ని ప్రారంభించింది. ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ రంగంలో క్రియేటివ్ సొల్యూషన్స్ ని తీసుకు రావాలని దేశంలోని స్టార్టప్‌లకు ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ కార్యక్రమంలో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ పాల్గొన్నారు.
జాయింట్ సెక్రటరీ (ఇన్ ల్యాండ్ ఫిషరీస్) సాగర్ మెహ్రా ఈ ఈవెంట్ ని ప్రారంభించారు. కొత్త ఆలోచలతో మత్స రంగాన్ని ముందుకి తీసుకు రావడానికి యువత ముందుకి రావాలని అన్నారు. జాయింట్ సెక్రటరీ (మెరైన్ ఫిషరీస్) డాక్టర్. జె. బాలాజీ మాట్లాడుతూ చేపల పెంపకందారులకు మంచి అవకాశాలని కల్పించడం గురించి చెప్పారు.
మత్స్య శాఖ కార్యదర్శి జతీందర్ నాథ్ స్వైన్ ప్రాథమిక ఉత్పత్తి రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో మత్స్య పరిశ్రమ కూడా ఒకటి అన్నారు. అయితే దీనిని ముందుకు తీసుకెళ్లడానికి టెక్నాలజీ అవసరం అన్నారు.
రాష్ట్ర మంత్రి, MoFAH&D దేశం యొక్క ఆర్థిక మరియు మొత్తం అభివృద్ధిలో ఈ రంగం చాలా ముఖ్యమని అన్నారు. సుమారు 14.5 మిలియన్ల మందికి ఉపాధి ఈ రంగ కల్పిస్తోందని చెప్పారు.