చరిత్ర సృష్టించిన ఐర్లాండ్‌.. వెస్టిండీస్ పై సిరీస్‌ కైవసం

-

వెస్టిండీస్‌ పర్యటనలో ఐర్లాండ్‌ జట్టు సంచలన రికార్డు సృష్టించింది. కరేబియన్లను సొంత గడ్డపైనే ఓడించి వన్డే సిరీస్ ను దక్కించుకుంది. మూడు వన్డేల సిరీస్‌ ను 2-1 తేడాతో గెలుచుకుంది ఐర్లాండ్‌. మూడో వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 212 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ జట్టు ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ హాఫ్‌ సెంచరీతో జట్టుకు గౌరవ ప్రదమైన పరుగులను అందించాడు.

ఇక 214 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ జట్టు 44.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ను రీచ్‌ అయింది. దీంతో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా… వన్డే సిరీస్‌ ను ఎగురవేసుకుని పోయింది ఐర్లాండ్‌ జట్టు. ఐర్లాండ్‌ బ్యాటర్లలో ఆండీ మెక్‌ బ్రైన్‌ 59, హ్యారీ టెక్టర్‌ 52 పరుగులతో రాణించారు. కెప్టెన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ కూడా 44 పరుగులతో పర్వాలేదని పించాడు. దీంతో విండీస్‌ పై ఐర్లాండ్‌ గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఇక ఈ విజయంతో కరేబియన్‌ గడ్డపై ఐర్లాండ్‌ తొలిసారి వన్డే సిరీస్‌ కైవసం చేసుకుని కొత్త చరిత్ర సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news