BREAKING : తమిళనాడులో ఒకదానికొకటి ఢీకొన్న 6 వాహనాలు.. ఐదుగురు మృతి

-

తమిళనాడులోని కడలూర్‌ జిల్లా వెప్పూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఒకదానికొకటి ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై 2 ప్రైవేటు బస్సులు, 2 లారీలు, 2 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news