మాములుగా రాజకీయాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మరియు దూషణలకు దిగడం చూస్తూనే ఉంటాము. కానీ కొందరు నాయకులు అయితే రాజకీయాల్లో ఏర్పడిన శత్రుత్వాన్ని ఎలా చూస్తారంటే.. వ్యక్తిగతంగా వారి నాశనాన్ని కోరుకుంటారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కి సంబంధించిన వ్యక్తిగత విషయం ఒకటి వైరల్ గా మారింది. ఎవరో సోషల్ మీడియా వేదికగా కొడాలి నానికి క్యాన్సర్ అని వార్తను స్ప్రెడ్ చేశారు. దీనితో కొడాలి నాని ఆరోగ్యం గురించి కన్నుకోవడానికి ఆయనకు వరుసగా కాల్స్ చేస్తుంటే… ఆయన ఈ విధంగా స్పందించారు. వార్తలలో వస్తున్నట్లుగా నాకు ఎటువంటి అనారోగ్యం లేదు కాన్సర్ అంతకంటే లేదు అంటూ కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు నేను చేయనని.. నాపై కావాలనే టీడీపీ సోషల్ మీడియా లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తిగా తెలుసుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు వార్తలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చాడు.
చంద్రబాబు నాయుడును శాశ్వతంగా రాజకీయాల నుండి దూరం చేసే అంత వరకు నేను ఈ భూమి మీదే ఉంటానన్నారు.