జనగామలో టిఆర్ఎస్ – బిజెపి మధ్య ఫ్లెక్సీ వార్

-

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంఘ్రామ యాత్ర నేటితో 15వ రోజుకు చేరుకుంది. అయితే బండి సంజయ్ పాదయాత్ర నేడు జనగామ నియోజకవర్గంలోకి చేరుకోనుంది. దీంతో జనగామలో టిఆర్ఎస్, బిజెపి మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఇరు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, ప్రచార హోల్డింగ్స్ ను ఏర్పాటు చేశాయి. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరితో టిఆర్ఎస్ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

జనగామ లో అడుగు పెట్టాలంటే నీతి అయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ హోల్డింగ్స్ ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఈ హోల్డింగ్స్ ని స్వయంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు బండి సంజయ్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ.. భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి బిజెపి శ్రేణులు. అయితే కొన్ని బిజెపి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో టీఆర్ఎస్ నాయకులే చించేసారని బిజెపి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగామ లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news