పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడని.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది.. అన్ని పరిశ్రమలు వచ్చి ఉంటే ఆ జాబితా రిలీజ్ చేయొచ్చు కదా ? అని నిలదీశారు.
ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పని చేయలేదు.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గుర్ఖా వాళ్ళకు సూటు బూటు వేసి ఫోటోలు తీసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చెప్పిన మాటలకు, చేసుకున్న ఎమ్ఓయూలకు, వాస్తవ పరిస్థితికి సంబంధం ఉందా?? అని నిలదీశారు. మా ముఖ్యమంత్రి పరిశ్రమలు గ్రౌండ్ అయిన తర్వాతే వివరాలు చెప్పాలి అన్నారు.. ఒక్క ఫోన్ కాల్ తో పరిశ్రమల సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.. ఏ ముఖ్యమంత్రి ఇలా చెబుతారు!? అని ప్రశ్నించారు.
భారతమ్మ గురించి లోకేష్ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు?? రాజకీయాల్లో లేని భారతమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని పేర్కొన్నారు. నీకు, బ్రాహ్మణీకి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఇంట్లో తేల్చుకోండి.. అంతేకాని మా చేత బ్రాహ్మణీని తిట్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్?? అని నిప్పులు చెరిగారు. బీచ్‌లో మందు తాగుతూ అమ్మాయిలతో తిరిగే చదువులు, సంస్కృతి మాకు లేవని తెలిపారు.