అమెజాన్‌లో అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్ జరగనుండగా.. అటు ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు బిగ్ దివాలీ సేల్ జరగనుంది.
భారత్‌లో ఆన్లైన్ షాపింగ్‌ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. దసరా పండుగ సందర్భంగా మొన్నీ మధ్యే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ప్రత్యేక సేల్‌లను నిర్వహించిన విషయం విదితమే. అయితే మరో రెండు మూడు రోజుల్లో ఈ రెండు సంస్థలు మళ్లీ స్పెషల్ సేల్‌లను ప్రారంభించనున్నాయి. దీపావళి సందర్భంగా అమెజాన్ మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌ను నిర్వహించనుంది. దీంతో మరోసారి వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ సంస్థలు సిద్ధమవుతున్నాయి.
అమెజాన్‌లో అక్టోబర్ 13 నుంచి 17వ తేదీ వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్ జరగనుండగా.. అటు ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 12 నుంచి 16వ తేదీ వరకు బిగ్ దివాలీ సేల్ జరగనుంది. ఈ క్రమంలో అమెజాన్‌లో ఐసీఐసీ కార్డులతో ఐటమ్స్‌ను కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ కార్డులకు ఈ ఆఫర్‌ను అందివ్వనున్నారు. ఇక అనేక ఉత్పత్తులను వడ్డీ ఏమీ లేకుండానే నో కాస్ట్ ఈఎంఐ విధానంలో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్లు 12 గంటల కన్నా ముందుగానే ప్రైమ్, ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.