పోటెత్తిన కృష్ణా వరద..ఈ ప్రాంతాలకు పొంచి ఉన్న ప్రమాదం…!

-

కృష్ణానది వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ దిగువున లంక గ్రామాల్లో దయనీయపరిస్థితులు నెలకొన్నాయి. వరద పోటెత్తడంతో చాలా లంకలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరద పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఫ్లడ్‌ పెరుగుతున్నందున అధికారులు అలర్ట్ అయ్యారు.


భారీవర్షాలు, వరదలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. పదేళ్లలో ఎన్నడూ లేని వరదతో పోటెత్తుతోంది. గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరప్రాంత లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మూడు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న వరద లంక గ్రామాలను భయపెడుతోంది. ప్రకాశం బ్యారేజికి దిగువన తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో కృష్ణా నది వరద ఉధృతి పెరగడంతో.. లంకగ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news