హైదరాబాద్ లో మీ సేవ కేంద్రాల వద్ద జాతర వాతావరణం నెలకొంది. ఉదయం 6 గంటలనుండి చాలా ప్రాంతాల్లో చాంతాడంత క్యూలు దర్శనమిస్తున్నాయి. వరద బాధితుల కోసం ఇంకా సాయం అందని బాధితులకు 10000 చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో పాటు దానికి ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వరద బాధితులు అంతా డబ్బు కోసం మీ సేవలో అర్జీ పెట్టుకునేందుకు మీసేవ బయట పడిగాపులు కాస్తున్నారు. అయితే సర్వర్లు డౌన్ అయ్యాయని చెబుతూ ఎక్కడికక్కడ నిర్వాహకులు చేతులు ఎత్తేస్తున్నారు అని సమాచారం అందుతోంది.
ఇక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బాధితుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. చాలా మీసేవ కేంద్రాల వద్ద వరద సహాయం తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేశామని సర్వర్ డౌన్ ఉన్న కారణంగా ఈ నెల 22 నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభిస్తామని బోర్డులు కూడా పెట్టేస్తున్నారు నిర్వాహకులు.ఇక నిన్న ఈ వరద సహాయం కోసం అర్జీ లు పెట్టుకునే వారిని పరిశీలించడానికి వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి చేదు అనుభవం ఎదురైంది. ఉదయం నుంచి క్యూలో నిలుచున్న మహిళలు అసహనానికి గురి కావాల్సి వచ్చింది ఏకంగా మహిళలు ఆయనకు చెప్పులు చూపించి ఆయన్ని దుర్భాషలాడటంతో అయన వెను తిరగాల్సి వచ్చింది.