పెన్షన్ దారులకి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్ తీసుకునే మాజీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. కరోనా వైరస్ పాలన విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో కోత విధించిన 50 శాతం పింఛన్ ని తిరిగి పెన్షన్దారులకు చెల్లించేందుకు సిద్ధమైంది. ఆ మొత్తాన్ని రెండు విడతలుగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ అంగీకరించారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

మొదటి విడత మొత్తాన్ని డిసెంబర్ 1వ తేదీన విడుదలయ్యే పింఛన్ తో సహా అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక మరో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు డిజాస్టర్ అలోవేన్స్(డీఏ) పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2018 జూలై లో పెంచిన 3.144 శాతం కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో వారికి 27.248 నుండి 30.392 కి కరువు భత్యం పెరిగింది.