వరద బాధితుల ఆగ్రహం..ఎంపీ జనార్ధన్​పై కుర్చీలతో దాడి..!

-

బిహార్​ను వణికిస్తున్న వరదలు.. ప్రజల్లో రాజకీయ నాయకులపై ఆగ్రహానికి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో నష్టాన్ని అంచనా వేసేందుకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మహారాజ్​గంజ్​ ఎంపీ జనార్ధన్​ సింగ్ సిగ్రివాల్​కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.సివాన్​ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి.. లక్రి నాబిగబ్జ్​కు వచ్చిన సిగ్రవాల్​కు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిలో కొంత మంది ఎంపీ సహా ఆయనతో పాటు వచ్చిన అధికారులపైకి కుర్చీలు విసిరారు.

Mp janardan reddy
Mp janardan reddy

చాలా మంది రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో పర్యటించినా.. ఎవరూ సహాయం చేయలేదన్నది స్థానికుల ప్రధాన ఆరోపణ. కొంత మంది ఎంపీ సిగ్రివాల్​ను కలిసి పరిస్థితి వివరించినా.. తమకు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఎంపీపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.భారీ వరదల కారణంగా బిహార్​లో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. 74 లక్షల మందిపై తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news