ఈసారి గణతంత్ర దినోత్సవంకి ఇక్కడ పుష్ప ప్రదర్శన రద్దు..!

Join Our Community
follow manalokam on social media

కరోనా వైరస్ మహమ్మారై అందర్నీ పట్టి పీడించింది. ఈ మహమ్మారి ‌కారణం గానే ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాల్ ‌బాగ్‌ ఉద్యానవన గాజు మందిరం లో పుష్ప ప్రదర్శనను రద్దు చేయడం జరిగింది. అయితే మైసూరు ఉద్యాన కళాశాల, ఉద్యాన వనాల శాఖ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియ జేయడం జరిగింది.

ప్రతీ ఏటా చేసే ఈ పుష్ప ప్రదర్శన ఈసారి ఇక లేనట్టే. మామూలుగా అయితే ప్రతీ సంవత్సరం ఈ పుష్ప ప్రదర్శన ని జనవరి ఎనిమిదో తేదీ నాడే మొదలు పెట్టడం ఆనవాయితీ. కొన్ని ఏళ్ల నుండి లాల్ ‌బాగ్‌ ఉద్యానవన గాజు మందిరం లో పుష్ప ప్రదర్శనను చేస్తూ వచ్చారు. ఈ ప్రదర్శన లో వివిధ రకాల పుష్పాలను ఏర్పాటు చేసేవారు. వీటిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం లక్షల మంది వచ్చే వారు.

ఇది ఇలా ఉంటే ఆగస్టు 15 న కరోనా లాక్‌డౌన్‌ సమయం లోనూ కూడా ఇక్కడ పుష్ప ప్రదర్శనను రద్దు చేసిన సంగతి కూడా మనకి తెలిసినదే. అయితే ఇప్పుడు రాబోయే గణతంత్ర దినోత్సవం కి కూడా ఈ పుష్ప ప్రదర్శన లేదు. ఈసారి గణతంత్ర వేడుకలకూ ప్రదర్శన రద్దు చేస్తున్నట్టు ఉద్యాన వనాల శాఖ అధికారులు తెలియ జేయడం జరిగింది.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...