ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో సంతోషం ఉండాలని కోరుకుంటాడు. ప్రశాంతంగా జీవించాలని భావిస్తాడు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండాలంటే అందుకు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. పురాణాల్లో చెప్పిన నియమాలను స్త్రీలు, పురుషులు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జీవితాల్లో సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి. పేద, ధనిక ఎవరైనా సరే ఈ నియమాలను పాటిస్తే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు.
హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు అమావాస్య, పూర్ణిమ, చతుర్ధశి, అష్టమి రోజుల్లో నూనెతో మసాజ్ చేసుకోరాదు. అలాగే మాంసాహారం తినరాదు. ఈ నియమాన్ని పాటించడం వల్ల సంతోషం, ప్రశాంతత నెలకొంటాయి.
పురుషులు పరాయి స్త్రీలను కన్నెత్తి చూడరాదు. లేదంటే సమస్యలు వస్తాయి.
బయటికి వెళ్లి ఇంటికి వచ్చాక ఇంట్లోకి అడుగు పెట్టేముందు కాళ్లను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతృప్తి చెందుతుంది. ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రశాంతత ఉంటుంది.
దేవుళ్లు, దేవతల విగ్రహాలు, ఫొటోలు, దీపాలు, శివలింగం, బంగారం, ఇతర సామగ్రిని నేల మీద పెట్టరాదు. పెట్టాల్సి వస్తే వాటిని శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి.
సూర్యాస్తమయం సమయంలో స్త్రీ, పురుషులు శృంగారంలో పాల్గొనరాదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించిన వారు అవుతారు.
పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మహిళలను అవమానించకూడదు. అలా చేస్తే కుబేరుడికి ఆగ్రహం వస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు వస్తాయి.
నెగెటివ్‌గా ఆలోచించేవారికి, అపరిశుభ్రంగా ఉండేవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. వారి వల్ల నెగెటివ్ శక్తి ప్రసారం అవుతుంది. అది మంచిది కాదు.
ఆదివారాల్లో రాగి పాత్రలను వాడకూడదు. అలా చేస్తే సూర్య దేవుడికి ఆగ్రహం వస్తుంది.