పిల్లలు.. పిడుగులు అంటారు. పిల్లలను కంట్రోల్ చేయలేక, వారు తమ మాట వినలేదని బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. అయితే అటువంటి పిల్లలు మీ మాట విని బుద్ధిగా చదువుకోవాలంటే కింది విధంగా చేయండి..
– పిల్లల గదిలో అద్దం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే వస్తుంతో కప్పాలి.
– పిల్లవాని తల నైరుతి (దక్షిణ) దిశ వైపు ఉండేలా పడుకోబెట్టాలి. ఆ విధంగా నిద్రించే ఏర్పాటు చేయాలి.
– పిల్లల కోసం రొట్టెలు లేదా ఫలహారం చేసేటపుడు శాంతి మంత్రం పఠించాలి.
– పిల్లలు నిద్రించే గది చీకటిగా ఉండకూడదు.
– ప్రతి దినం తల్లి పిల్లలకు తేనె నాకించాలి. పిల్లలకు నల్లని దుస్తులు వీలైనంత తక్కువగా ధరింపజేయాలి.
– పౌర్ణమి రోజున వెన్నెల పడే చోటపిల్లలకు తీపి పదార్దం తినిపించాలి.
– నిద్రించే ముందు పిల్లలను కౌగలించుకొని పడుకోబెట్టాలి.
– ఉదయం తల నిమురుతూ నిద్ర లేపాలి.
ఇలా పై చిట్కాలను పాటించి చూడండి. తప్పక మీ పిల్లలు మీ మాట వింటారు.
– శ్రీ