సీతక్క బయటపెట్టిన సంచలన వీడియో.. కేసీఆర్ సర్కార్ గుట్టు రట్టు..!

-

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తప్పుడు లెక్కలు చెప్తుందంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానశారి అనసూయ అలియాస్ సీతక్క బయటపెట్టిన వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ‘‘సార్.. ఇప్పటివరకు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు చాలు, కనీసం కరోనా విషయంలో నిజాలు చెప్పండి. అప్పుడు ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉంటారు.

జులై 21న కేవలం ఏడు కరోనా మరణాలు అని గవర్నమెంట్ తెలియజేసింది. కానీ ఆ ఒక్క రోజే కనీసం 30 పైగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన శవాలను హైదరాబాద్‌లోని ఈఎస్ఐ శ్మశాన వాటికలో దహనం చేస్తున్న దృశ్యాలు చూడండి. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత దహన సంస్కారాలు చేయరు.’’ అని సీతక్క ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news