వాస్తు: శుభ ఫలితాల కోసం మీ ఇంటి లోపల గచ్చుపైన ఈ మార్పులు చెయ్యండి..!

-

కొన్ని కొన్ని సార్లు చిన్నపాటి వాస్తు తప్పులు వల్ల మన ఇంట్లో ఆనందం ఉండకుండా ఉంటుంది. అదే విధంగా ఆర్థిక సమస్యలు వంటి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఈ రోజు వాస్తు పండితులు కొన్ని విషయాలను చెప్పారు. ఈ విధంగా మార్పులని చేసి వాస్తు టిప్స్ ని కనుక పాటించారు అంటే ఆనందం కలుగుతుందని ఎటువంటి సమస్యలు రావు అని పండితులు చెప్పడం జరిగింది.

మరి ఇక ఆలస్యమెందుకు ఆ వాస్తు టిప్స్ ని కూడా చూద్దాం. నైరుతి దిశలో ఉండే గచ్చు పైన ఈ మార్పు చేయడం వల్ల ఆనందం ఉంటుందని సమస్యలేమైనా ఉంటే కూడా తొలగిపోతాయి అని అంటున్నారు. అయితే ఎలా పోతాయి…?, ఎటువంటి మార్పులు చేయాలి అనే విషయాలు కూడా చూసేద్దాం.

ఇంట్లో కానీ ఆఫీసులో కానీ మంచి ఫలితాలు కనబడాలంటే నైరుతి వైపు ఉండే గచ్చు పైన పసుపు రంగు మార్బుల్ లేదా ఫ్లోర్ క్లాత్ వంటివి వాడాలి. ఇప్పుడు ఫ్లోర్ కి సంబంధించిన షీట్స్ క్లాత్స్ వంటివి అమ్ముతున్నారు.

మీరు పసుపు రంగు వాటిని కొనుగోలు చేసి నైరుతి దిశలో ఉండే గచ్చు పైన వేస్తే ఏ సమస్య ఉండదు ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉండవని.. అదే విధంగా ఆనందంగా ఉండొచ్చు అని పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆఫీస్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కాలను అనుసరించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కనపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news