సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి ఆకలి ఎక్కువగా అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాధి లేకున్నా కొందరికి విపరీతమైన ఆకలి ఉంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకుంటే దాంతో ఆకలిని నియంత్రించవచ్చు. ఫలితంగా ఆహారం ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* బీన్స్, పచ్చి బఠానీలు, శనగలు, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే అంత త్వరగా ఆకలి కాదు. దీంతో ఆకలిని నియంత్రించవచ్చు.
* గుడ్లు, మాంసాహారం, పెరుగు, సోయా ఉత్పత్తులను తీసుకున్నా ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఆహారం తినాలనే యావ తగ్గుతుంది.
* ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, సీడ్స్‌లలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను కొద్దిగా తీసుకున్నా చాలు.. దాంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆకలి కంట్రోల్‌లో ఉంటుంది.
* భోజనానికి ముందు సూప్ తాగితే ఆకలి నియంత్రణలోకి వస్తుంది. లేదా మంచినీటిని అయినా తాగవచ్చు.
* భోజనానికి ముందు ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్లు తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇక కాఫీ తాగినా, డార్క్ చాకొలెట్లను తిన్నా ఆకలిని నియంత్రించవచ్చు.