మన దేశంలో ఎన్ని చర్యలు చేపడుతున్నా ఉగ్రవాదులు దాడులకు దిగుతూనే ఉన్నారు. సరిహద్దు రాష్ట్రాలను ఎక్కువగా ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో నిఘా వర్గాలు అప్రమత్తం అవుతున్నాయి. తాజాగా బెంగాల్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేసారు. ప్రముఖ రాజకీయ నాయకులను ఉగ్రవాదులు టార్గెట్ చేసారు అని నిఘా వర్గాలు ఒక జాబితాను విడుదల చేసాయి. బెంగాల్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు సూచించాయి.
ప్రముఖలను ఎక్కువగా ఉగ్రవాదులు టార్గెట్ చేసారు అని పేర్కొన్నాయి. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను బెంగాల్ లో అదుపులోకి తీసుకున్నారు. కేరళలో కూడా ఉగ్రవాదులు భారీగా దొరికారు. ఆల్ ఖైదా టార్గెట్ చేసింది అని నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా వచ్చే ఏడాది బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి.