తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రోజుకు ఒక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవల కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. కేసీఆర్ బహిరంగ సభకు వెళ్లడం.. దాని తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హన్మంత రావు కన్నీరు పెట్టుకోవడం వంటివి చూశాం. తాజా గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. సీఎం పుట్టిన రోజుకు నిరుద్యోగానికి సంబంధం ఎమిటీ అని ప్రశ్నించారు. కాగ నేడు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్.. రాష్ట్ర రైతు దినోత్సవంగా జరుపుకుంది.
అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరోద్యగ దినం గా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరోద్యగ దినం పేరుతో నిరసన కార్యక్రమలు చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గరెడ్డి.. సీఎం జన్మదినానికి నిరుద్యోగానికి సంబంధం ఎమిటీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు జరుపుకోవడంలో తప్పు ఉందా అని అన్నారు.
కాగ ఈ వ్యాఖ్యలు పరోక్షంగా నేడు కాంగ్రెస్ పార్టీ చేసిన నిరుద్యోగ దిన నిరసన లకు వ్యతిరేకంగా చేసినట్టు అనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం రావడం ఖాయం గా కనిపిస్తుంది. సీనియర్ నాయకులు అందరూ కూడా వరుసగా తమ వ్యతిరేక ధ్వని సందర్భాన్ని బట్టి వినిపిస్తున్నారు.