బేగం మమత అంటే గెలుస్తారా…? ఆడుకున్న సేన

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మంచి విజయం సాధించారు. ఆమె విజయం దెబ్బకు బిజెపి నేతలు బెంగాల్ లో ఇబ్బందులు పడ్డారు. ఇక మమతా బెనర్జీ విజయంపై బిజెపి మాజీ మిత్రపక్షం శివసేన స్పందించింది. మోడిషా తుఫాన్ ని మమత సమర్ధవంతంగా అడ్డుకున్నారని శివసేన తన పత్రిక సామ్నాలో పేర్కొంది. బిజెపి ఇన్నింగ్స్ వందలోపు ఆల్ అవుట్ అయింది అంటూ కామెంట్స్ చేసింది.

అలాగే మే 2 తర్వాత మమత ఇంటికే వెళ్తారు అంటూ కామెంట్ చేసారని బేగం మమత అంటూ మాట్లాడారని శివసేన తన పత్రిక సామ్నాలో ఆరోపించింది. బేగం మమత అంటే గెలుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది శివసేన. “బెంగాల్ ప్రజలు బిజెపిని తీవ్రంగా తిరస్కరించారు. బెంగాల్ లో మమతను ఓడించడానికి బిజెపి ఏమి చేయలేదు? ‘జై శ్రీ రామ్’ నినాదంతో ముందుకు వెళ్ళారని శివసేన ఆరోపించింది.