బ్రేకింగ్: ఏపీలో ఆగిపోయిన రేషన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ లో రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు కొన్ని సమస్యలతో పంపిణీ ఆగిపోయింది. సీఎం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇంటింటికి రేషన్ కు ఎండియూలు బ్రేక్ వేసారు. ఎండీయూలు ఆకస్మిక సమ్మెతో రేషన్ పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు విధులకు హాజరు కాబోమని ఎండీయూలు స్పష్టం చేస్తున్నారు.

ఇటీవల ఎండియూ లకు సరుకు ఇచ్చే క్రమంలో కరోనా సోకి విజయవాడలోనే ముగ్గురు డీలర్లు మృతి చెందారు. ఎండీయూలతో పని చేయించలేక డిపోల్లో పంపిణీ చేయాలని డీలర్లపై మండలస్థాయి అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. మండల అధికారుల తీరుతో రేషన్ డిపోలు కరోనా కేంద్రాలుగా మారతాయని పంపిణీ పై రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పంపిణీ ఆగిపోయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్, ఇతర డిమాండ్ అమలు చేసే వరకు విధులకు ఎండియూలు హాజరయ్యేది లేదని అనున్నారు.