మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. చాందిని చౌక్ ఎంపీగా ఉన్న ఆయనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. నిన్న ప్రకటించిన ఫస్ట్ లిస్టులో ఆయనకు బదులు ప్రవీణ్ ఖండేల్వాల్కు టికెట్ కేటాయించింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. భవిష్యత్తులో తన వైద్య వృత్తికి అంకితం అవుతానని ఆయన ట్వీట్ చేశారు.
కాగా,కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ నిన్న లోక్ సభ ఎన్నికలకు తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.16 రాష్ట్రాల్లోని 195 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును బీజేపీ విడుదల చేసింది.